
ఇరువర్గాలకు ప్రయోజనం
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి లోక్ అదాలత్‌లు ఉపయోగపడతాయి. కేసుల కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు, ఇరువర్గాలు రాజీ చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారంతో కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గుతుంది. – సి.రత్న పద్మావతి,
జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్
సత్వర న్యాయం
లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుంది. డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక్క వేదిక. రాజీయే రాజమార్గం అనే సూత్రంపై లోక్ అదాలత్‌లు పనిచేస్తాయి.
– వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ,
జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి

ఇరువర్గాలకు ప్రయోజనం