‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’ | - | Sakshi
Sakshi News home page

‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’

Sep 13 2025 6:00 AM | Updated on Sep 13 2025 6:00 AM

‘యూరి

‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’

జగిత్యాలటౌన్‌: యూరియా కొరత కేంద్ర ప్ర భుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరాభవన్‌ శుక్రవారం మాట్లాడుతూ.. పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాము అదేపార్టీలో ఉంటున్నామని స్పీకర్‌కు వివరణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు సర్కార్‌ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేసిందన్నారు. రూ.176 కోట్లు చెల్లించి, బ్యాంకు తాకట్టులో ఉన్న కార్మాగారాన్ని విడిపించడం జరిగిందన్నారు. నాయకులు జువ్వా డి కృష్ణారావు, బండ శంకర్‌, గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, నందయ్య పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

వెల్గటూర్‌: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎండపల్లి మండల ముఖ్య నాయకులతో కరీంనగర్‌లో శుక్రవారం సమీక్షించారు. బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగి నంత మాత్రాన డ్యాం కూలిపోయిందని అ బ ద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్‌ గద్దెనెక్కిందని ఆరోపించారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ మరమ్మతు చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణరావు పాల్గొన్నారు.

యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో శుక్రవారం భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్ఛారణలతో రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్య హో మం హారతి, మంత్రపుష్పం పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్‌ కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నీటి విడుదల నిలిపివేత

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి జిల్లాకు సాగునీరు అందించే కాకతీయ కాలువకు శుక్రవారం నీటి విడుదలను నిలిపివేశారు. నిర్మల్‌ జిల్లా సావెల్‌ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో ఒక్కరు గల్లంతు కావడంతో, ఆయన ఆచూకీ కోసం నీటి విడుదల ఆపేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 17,715 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆ మేరకు ఔట్‌ఫ్లో వెళ్తోంది. ప్రాజెక్టు నుంచి వరద కాలు వకు 8వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కులు, మిషన భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జిల్లాకు వర్ష సూచన

జగిత్యాలఅగ్రికల్చర్‌: రాబోయే ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి 17 వరకు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 29– 31 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశముందన్నారు.

‘యూరియా కొరత   కేంద్రం వైఫల్యమే’1
1/3

‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’

‘యూరియా కొరత   కేంద్రం వైఫల్యమే’2
2/3

‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’

‘యూరియా కొరత   కేంద్రం వైఫల్యమే’3
3/3

‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement