పాఠశాలల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల అభివృద్ధికి కృషి

Sep 13 2025 6:00 AM | Updated on Sep 13 2025 6:00 AM

పాఠశాలల అభివృద్ధికి కృషి

పాఠశాలల అభివృద్ధికి కృషి

● చల్‌గల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌/జగిత్యాల: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షలతో నిర్మించే సైన్స్‌ ల్యాబ్‌కు, రూ.19 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. చల్‌గల్‌ గ్రామంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేయడం జరిగిందన్నారు. 10ఎకరాల్లో ఇండోర్‌ స్టేడియం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్‌ వరందన్‌, ఎంఈవో గంగాధర్‌, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ దామోదర్‌రావు, నాయకులు పెండెం రాములు, బాలముకుందం, మల్లేశం, ఆసీఫ్‌ పాల్గొన్నారు.

లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు పాఠశాలల్లోని లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన గదులను, లైబ్రరీని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు, టీఆర్‌నగర్‌ వద్ద ఏటీసీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లైబ్రరీకి పుస్తకాలు, పేపర్లు అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కమిషనర్‌ స్పందన, డీఈ ఆనంద్‌, ఏఈ అనిల్‌ పాల్గొన్నారు.

హైపటైటిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

హైపటైటిస్‌ బి వ్యాక్సిన్‌పై అవగాహన లేక అనేక మంది మరణిస్తున్నారని, అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం మాత శిశు కేంద్రంలో హెల్త్‌కేర్‌ వర్కర్లకు హైపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ను ఇచ్చారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, ఆర్‌ఎంవో సుమన్‌రావు, గీతిక, సూర్య, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement