
సమర్థవంతమైన నేర విచారణ చేపట్టాలి
జగిత్యాలక్రైం: ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇన్వెస్టిగేషన్ అండ్ బిల్డింగ్ ది కేస్ అంశాలపై పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేర విచారణ, నేర నిరూపన సమర్థవంతంగా చేయడం ద్వారా నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. కేసుల దర్యాఫ్తు ఒక సమగ్ర ప్రక్రియ అని, ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జ్‌షీట్ సిద్ధం చేసేంత వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించడం అత్యంత ముఖ్యమన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో నాన్ గ్రేవ్ అగెనెస్ట్ ఉమెన్ కేసుల్లో, గంజాయ్, మత్తు పదార్థాల కేసుల్లో ప్రొసిజర్ ప్రకా రం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. డీఎస్పీ రఘుచందర్, సీఐ లు అనిల్‌కుమార్, సురేశ్‌కుమార్, సుధాకర్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, రవి, ఎస్సైలు పాల్గొన్నారు.
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ
మేడిపల్లి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసు డైరీలు, సిబ్బంది పనితీరును తెలు సుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. 5ఎస్ విధానాన్ని పాటించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. స్టేషన్‌పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. పాతనేరస్తులపై నిఘా పెంచాలన్నారు. ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.