
ప్రిజన్ డ్యూటీ మీట్– 2025లో జైలర్‌కు గోల్డ్‌మెడల్
జగిత్యాలజోన్: ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్– 2025 క్రీడోత్సవాలు సెప్టెంబర్ 9నుంచి 11వరకు హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అయా రాష్ట్రాల తరఫున జైళ్లశాఖకు చెందిన 1300 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మన రాష్ట్రం తరుఫున పాల్గొన్న జగిత్యాల స్పెషల్ సబ్ జైలర్ మొగిలేశు వన్ మినిట్ డ్రిల్ విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. మెగిలేశును హెడ్ వార్డర్లు ఎండీ.మజారోద్దిన్, పీహెచ్.దేవదాసు, కానిస్టేబుళ్లు ఎస్.అశోక్‌కుమార్, ఎం.విజయ్, బి.శ్రీనివాస్ అభినందించారు.