
పంచాయతీ భవనానికి రెండుసార్లు ప్రారంభోత్సవం
మల్లాపూర్: మండలంలోని సిరిపూర్‌లో ఉపాధి హామీ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారం బీఆర్‌ఎస్ నాయకులు ఒకసారి, కాంగ్రెస్ నాయకులు మరోసారి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసిన నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రోటోకాల్ ప్రకారం తామే ప్రారంభించాలంటూ ప్యాక్స్ చైర్మన్ బద్దం అంజిరెడ్డి తాళం వేసి ఉన్న భవనానికి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఉదయం ప్రారంభించారు. మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి పార్టీ ఇన్‌చార్జీ జువ్వాడి నర్సింగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలతో కలిసి ప్రారంభించారు. ఒకే భవనాన్ని రెండుసార్లు ప్రారంభించడమేంటని మండల ప్రజలు మాట్లాడుకోవడం కొసమెరుపు.