● డీపీవో మదన్‌మోహన్ ● డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని డీపీవో మదన్‌మోహన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. నిర్మాణా ల్లో సారంగాపూర్ వెనుకబడి ఉందన్నారు. 455 ఇళ్లు మంజూరు కాగా.. 274 ఇళ్లకు మా ర్కింగ్ ఇచ్చామని, ఇందులో కేవలం 138 ఇళ్లు మాత్రమే బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారుల్లో సగం మంది నిర్మాణానికి ముందుకురావడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీడీవో చౌడారపు గంగాధర్ పాల్గొన్నారు.
వరద కాలువకు నీటి విడుదల పెంపు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ నుంచి వరదకాలువకు విడుదలవుతున్న నీటి సామర్థ్యాన్ని పెంచారు. నిన్నటివరకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేయగా.. గురువారం నుంచి 19వేలకు పెంచారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లను మూసివేశారు. 29,545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా కాలువలకు విడుదల చేస్తున్నారు.
ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండొద్దు
సారంగాపూర్: ఇంటి పరిసరాలు, ఆవరణలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో పీహెచ్‌సీ ఆ ధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. రోగులకు మందులు పంపిణీ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయన్నారు. డెంగీ, మలేరియా, టైపాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో రక్తపరీక్షలు నిర్వహించగా.. ఆ లక్షణా లు ఎవరికీ కనిపించలేదన్నారు. అంతకుముందు గ్రామంలో డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ పర్యటించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి రాధారెడ్డి, సీహెచ్‌వో కుద్దుస్, సూపర్‌వైజర్ కిశోర్‌ఓ, ఎంఎల్‌హెచ్‌పీ సుష్మ ఉన్నారు.
సికెల్‌సెల్ ఎనీమియాపై
అవగాహన కల్పించాలి
జగిత్యాల: సికెల్‌సెల్ ఎనీమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీనివాస్ అన్నారు. మోతె పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎర్రరక్త కణాల నిర్మాణంలో మార్పు వచ్చి కొడవలి ఆకారంలోకి మారుతాయని, శరీరంలోని అన్ని ప్రదేశాలకు రక్తకణాలు వెళ్లలేక రక్తహీనత జరిగి నీరసం, ఆయాసం వస్తుందన్నారు. దీనికి రక్తం ఎక్కించడం ఒక్కటే మార్గమన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల వేగం పెంచాలి