
కాటమయ్య కిట్లతో గీతకార్మికులకు భద్రత
సారంగాపూర్: కాటమయ్య కిట్లతో గీత కార్మికులకు భద్రత ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 72 మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. కొల్వాయిలో రూ.20 లక్షలతో ఏర్పాటుచేసిన పల్లెదవాఖానాను ప్రారంభించారు. 20మందికి సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.5.80 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. రోల్లవాగు ప్రాజెక్టుకు ఎంపీ అర్వింద్, మంత్రి లక్ష్మణ్‌కుమార్ చొరవతో గేట్లు బిగిస్తామన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, గౌడ సంఘం అధ్యక్షుడు రాంచంద్రం, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్ ఉన్నారు.
గ్రామ అభివృద్ధికి కృషి
జగిత్యాలరూరల్: గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. భారీ వర్షాలకు జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లో రోడ్లు ధ్వంసమయ్యాయని, మరమ్మతు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. అవసరమైన పనులు గుర్తించి ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు రూపొందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.