
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
రాయికల్: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని వీరాపూర్, ఒడ్డెరకాలనీలో రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. 40మంది లబ్ధిదారులకు రూ.12లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు, 56మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. వీరాపూర్, రామాజీపేట రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జీఎంఆర్ ట్రస్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించామని, దీని ద్వారా యువతకు ఉపాధితోపాటు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రైతుల కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, వేలాది ఎకరాల్లో భూమి సాగవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, గన్నె రాజిరెడ్డి, సీడీపీవో మమత, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, నాయకులు పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్‌రావు, అచ్యుత్‌రావు, కిషన్‌రావు, రామస్వామి, నర్సయ్య, మహబూబ్ పాల్గొన్నారు.
ఎల్‌వోసీ అందజేత
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని చింతకుంటకు చెందిన నక్క సుజాతకు రూ.2.50 లక్షలు, అరవింద్‌నగర్‌కు చెందిన రాంచరణ్ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం రూ.75 వేల ఎల్‌వోసీలను ఎమ్మెల్యే అందించారు. శ్రీగాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు. అధ్యక్షుడు భూమ గంగారాం, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు.