
నీళ్లుండి ఏం లాభం లేదు
రాళ్లవాగు ప్రాజెక్టు మా గ్రామ భూములకు పైభాగంలో ఉంది. కాలువల ద్వారా ఊట్‌పెల్లి గ్రామాల భూములకు నీరందిస్తామని ప్రణాళిక రూపొందించారు. ఏళ్లు గడుస్తున్నా కాలువ పనులు చేపట్టడంలేదు. మా గ్రామానికి నీళ్లు వస్తే పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అధికారులు చొరవ చూపి కాలువ పనులను ప్రారంభించాలి.
– ఏజీబీ గణేశ్, రైతు, ఊట్‌పెల్లి
ఊట్‌పెల్లి, పెగ్గెర్లకు నీళ్లు వస్తాయని సంతోషపడ్డాం. ప్రాజెక్టు పనులు పూర్తయి ఏళ్లవుతోంది. కాలువ పనుల్లో జాప్యం చేయడం సరికాదు. భూషణరావుపేట శివారు వరకు కాలువ తవ్వారు. అక్కడి నుంచి కిలోమీటర్ కాలువ తవ్వితే మా గ్రామానికి నీళ్లు వచ్చేవి. ఇకనైనా కాలువ పనులు త్వరగా పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
– చీర్నం శ్రీకాంత్, రైతు, పెగ్గెర్ల
రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువకు అనుసంధానంగా ఉన్న కాలువ పనుల కోసం ప్రతిపాదనలు తయారు చేస్తాం. కాలువ పనుల్లో భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. తదుపరి వీలైనంతా త్వరగా ఊట్‌పెల్లి, పెగ్గెర్ల గ్రామాలకు వెళ్లే కాలువ పనులు చేపడుతాం. ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– ప్రశాంత్, నీటిపారుదలశాఖ డీఈ

నీళ్లుండి ఏం లాభం లేదు

నీళ్లుండి ఏం లాభం లేదు