
ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
జగిత్యాలటౌన్: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి కలెక్టర్ సత్యప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్, డీపీవో మదన్‌మోహన్, బీసీ సంక్షేమ అధికారి జి.సునీత, డీవైఎస్‌ఓ రవికుమార్ పాల్గొన్నారు.
తెలుగు భాషను కాపాడుకోవాలి
జగిత్యాల: తెలుగు భాషను కాపాడుకోవాలని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అన్నారు. మంగళవారం ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు శాఖ విభాగం అధ్యక్షుడు సురేందర్, మహేశ్, స్వరూపరాణి, గోవర్దన్, సాయిమధుకర్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.