
వ్యాపారుల సహకారంతో..
పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎస్సై సుధీర్‌రావు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని వర్తక సంఘాల నుంచి కోరారు. దీంతో పట్టణంలోని వర్తక, వ్యాపారులు, అన్ని సంఘాల నాయకులు సహకరించి కెమెరాల ఏర్పాటుకు కృషి చేశారు.
– ఎలగందుల సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షుడు
పట్టణంలో సీసీకెమెరాల ఏర్పాటుకు వర్తక వ్యాపారులందరూ సహకరించడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరి కొద్దిరోజుల్లోనే మరిన్ని బిగిస్తాం. ప్రస్తుతం 25 కెమెరాలు పనిచేస్తున్నాయి. మరో 10 సీసీకెమెరాలకు సన్నాహాలు చేస్తున్నాం. పర్యవేక్షణకూ ఓ వ్యక్తిని నియమించేలా చూస్తాం.
– సుధీర్‌రావు, ఎస్సై, రాయికల్

వ్యాపారుల సహకారంతో..