
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇళ్లు, కండ్లపల్లి మోడల్‌స్కూల్‌లో ఈజీఎస్ ద్వారా మంజూరైన అంగన్‌వాడీ, కిచెన్‌షెడ్ పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు చూడాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, ఇంజినీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరుణ్‌కుమార్, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: వైద్యులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు. పాతటైర్లు, డిస్పోజల్ గ్లాసులు, కంటైనర్స్‌లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, డ్రైడే చేపట్టి తొలగించాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.