కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Sep 10 2025 2:11 AM | Updated on Sep 10 2025 2:11 AM

కుటుం

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

అనారోగ్యంతో ఒకరు..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఈరవేణి రమ్య(30) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్‌రెడ్డి కథనం ప్రకారం.. రమ్య మంగళవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను స్కూల్‌కు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలు శ్రీఅమ్మ తలుపు తీయూశ్రీ అంటూ పిలిచినా పలక లేదు. దీంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రమ్య ఉరేసుకుని నిర్జీవంగా ఉండడంతో పిల్లలు లాస్య, ప్రవీన్‌, సుశాంత్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే రమ్య భర్త కృష్ణహరి బతుకుదెరువు కోసం 15 ఏళ్లుగా దుబాయ్‌ వెళ్తున్నాడు. భర్త దుబాయ్‌లోనే ఉండగా, భార్య కడసారి చూపు కోసం బయల్దేరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల దేవయ్య (55)కు గతంలో మూడుసార్లు రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. ఆపరేషన్ల కారణంగా కాళ్ల నొప్పులు విపరీతమయ్యాయి. పలుసార్లు ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో కొంతకాలంగా మనస్తానపానికి గురవుతున్నాడు. సోమవారం సాయంత్రం పొలం వద్దకని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి పొలం శివార్లలో వెతకగా దేవయ్య చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మంగళవారం ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య లచ్చవ్వ, కూతురు సౌజన్య, కుమారుడు రాజశేఖర్‌ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకుని ఒక రు..

కథలాపూర్‌: మండలకేంద్రానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ(54) మంగళవారం గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ కోరుట్ల ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ.. ఏడాది క్రితం సస్పెండ్‌ అయ్యాడు. అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబపోషణ, ఇతర అవసరాలకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనారాయణ కుమారుడు వికాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మద్యానికి బానిసై ఒకరు..

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్‌ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారంలో నివాసం ఉంటున్న వాడెపు జంగయ్య (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి తరుచూ గొడవలు పడుతున్నాడు. మంగళవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.

చికిత్స పొందుతూ విద్యార్థిని..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన లకావత్‌ లలిత– పరంగి దంపతుల కూతురు మధుమతి(16) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మధుమతి సరిగ్గా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుమతి ఈ నెల 1న గడ్డి మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.

మహిళ మృతి

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్‌కు చెందిన సమ్మవ్వ (45) చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు.. సమ్మవ్వ భర్త సమ్మయ్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె మద్యానికి బానిసైంది. పదిరోజుల క్రితం సమ్మవ్వ అల్లుడు బోసు ప్రభాకర్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరి మృతితో డిప్రెషన్‌కు లోనైంది. మానసిక వేదనతో ఈ నెల 8న మద్యం సేవించిన సమ్మవ్వ తన భర్త సమాధి వద్ద విలపించింది. అనంతరం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

సైదాపూర్‌: మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణస్వామి(42) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సైదాపూర్‌ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారంగా బోయిని సత్యనారాయణస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మణిసాయి, భార్య రేణుక హుస్నాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద సత్యనారాయణ, చిన్న కుమారుడు సాయితేజ ఉన్నారు. సాయితేజ కిరాణం షాపునకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ స్వామి ఇంట్లో ఉరేసుకొని మృతి చచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కుటుంబ కలహాలతో  వివాహిత ఆత్మహత్య1
1/3

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో  వివాహిత ఆత్మహత్య2
2/3

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో  వివాహిత ఆత్మహత్య3
3/3

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement