పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా.. | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా..

Sep 10 2025 2:11 AM | Updated on Sep 10 2025 2:11 AM

పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా..

పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా..

రామగుండం: పల్లెపాలనను మరింత పారదర్శకంగా అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘సమర్ద్‌’ పేరిట ప్రత్యేక పోర్టల్‌ రూపొందించింది. గ్రామ పంచాయతీల పాలన, పథకాల అమలు, నిధుల వినియోగం తదితర అంవాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

పోర్టల్‌లోని వివరాలు..

ఈ గ్రామ్‌స్వరాజ్‌ : పంచాయతీల డిజిటలైజేషన్‌, నిధుల ట్రాకింగ్‌, పథకాల అమలు, పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, బడ్జెట్‌, గ్రాంట్లు, గ్రామ సభల ఆమోదం, ప్రణాళికలు, అభివృద్ధి..

ప్లాన్‌ప్లస్‌ : వార్షిక ప్రణాళిక, అభివృద్ధి పనులకు సాయం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ప్రాజెక్టు ఆమోదం, గ్రామసభల నిర్ణయాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు..

పీఆర్‌–వన్‌ : పారిశుధ్యం, తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్‌ మిషన్‌, చెత్త సేకరణ, మురుగునీటి తొలగింపు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ..

లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ : శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలతో అనుసంధానించి డేటా నిర్వహణ..

పర్యవేక్షణ విధానం : జిల్లా పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు, కార్యదర్శుల ద్వారా పనితీరును పర్యవేక్షించే అవకాశం..

అవార్డులు, ప్రోత్సాహకాలు : ఏటా ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరును కనబరిచే పంచాయతీలకు ‘పంచాయత్‌ సశక్తీకరణ పురస్కార్‌’ ప్రదానానికి వీలు..

స్వచ్ఛభారత్‌ మిషన్‌ : మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన..

‘సమర్ద్‌’ పేరిట ప్రత్యేక పోర్టల్‌

రూపొందించిన కేంద్ర ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement