
పీఆర్సీ అమలు చేయాలి
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లకు ప్రభుత్వపరంగా నిధులు కేటాయించాలి. గౌరవ వేతనం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలి. నిత్యం మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ.. వారి ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వపరంగా అనేక సర్వేలు నిర్వహించి సమగ్రమైన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువగా బాధ్యత మోస్తున్నాం. గుర్తింపు లేదు. శ్రమకు తగిన ఫలితం లేదు. అధికారులు స్పందించి గౌవర వేతనం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలి.
– మెప్మా ఆర్పీల సంఘం జిల్లా నాయకులు