
పింఛన్ పెంచాలని ఆందోళన
జగిత్యాల: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పింఛన్ రూ.4 వేలు చెల్లించాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు, చేయూత కింద రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకొచ్చి 21 నెలలు పూర్తవుతు న్నా అమలు చేయడం లేదన్నారు.
ప్రభుత్వం స్పందించి పింఛన్ పెంచాలని డిమాండ్ చేశా రు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చెట్‌పల్లి ల క్ష్మణ్, బెజ్జంకి సతీశ్, బోనగిరి కిషన్, శనిగర పు కాంతక్క, దివాకర్, సునీల్, చంద్రశేఖర్, ఓంప్రకాశ్, ప్రవీణ్, సాయిప్రసాద్, సతీశ్, దయా ల హన్మంతు, సాయిలు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
దుబ్బ రాజన్న సన్నిధిలో కలెక్టర్ దంపతులు
సారంగాపూర్: మండలంలోని దుబ్బరాజేశ్వరస్వామిని సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు, అభిషేకాలు చేయించారు. ఆలయ ఈవో అనూష, అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించారు.
బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 13మంది అర్జీలు సమర్పించారు. వారితో ఎస్పీ మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని, వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే..
జగిత్యాల: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బమ్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు వరమన్నారు. మాజీ కౌన్సిలర్లు జయశ్రీ, పద్మ, పిప్పరి అనిత, సరిత, చిట్ల లత, రూప, మంజూల, రేణుక పాల్గొన్నారు.
‘కాళేశ్వరం’ను తుమ్మడిహెట్టి వద్ద నిర్మించాల్సింది
జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తుమ్మడిహెట్టి వద్ద నిర్మించే వీలున్నా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మేడిగడ్డ వద్ద నిర్మించడంతో సాంకేతికలోపం ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.10వేల కోట్లతో తుమ్మడిహెట్టి వద్ద నీటిని ఎల్లంపల్లికి తీసుకురావచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ పోలీస్‌క్వార్టర్స్‌లో పెట్రోల్‌బంక్ ఏర్పాటు చేసేలా చూడాలన్నా రు. వచ్చే ఆదాయాన్ని పోలీసు శాఖ వాడుకునే వీలుంటుందన్నారు. అనంతరం ఎస్పీ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట నాయకులు కొత్తమోహన్, బండ శంకర్, నందయ్య, విజయలక్ష్మీ, మాజీ కౌన్సిలర్లు పిప్పరి అనిత, జయశ్రీ పాల్గొన్నారు.

దుబ్బ రాజన్న సన్నిధిలో కలెక్టర్ దంపతులు

‘కాళేశ్వరం’ను తుమ్మడిహెట్టి వద్ద నిర్మించాల్సింది