అంగన్‌వాడీలపై యాప్‌ల భారం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై యాప్‌ల భారం

Sep 9 2025 8:37 AM | Updated on Sep 9 2025 12:50 PM

అంగన్

అంగన్‌వాడీలపై యాప్‌ల భారం

● తరచూ సర్వర్‌ సమస్య ● రికార్డులతో సతమతం

పెగడపల్లి: అంగన్‌వాడీ టీచర్లు పోషణ ట్రాకర్‌, ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్‌ యాప్‌లో లబ్ధిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్‌లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్‌ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్‌ సమస్యతో యాప్‌లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు కేంద్రాల వద్ద గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌తో లబ్ధిదారుల వివరాలు నమోదుకు సాంకేతిక సమస్య ఏర్పడుతోందని అంటున్న సి బ్బందికి తాజాగా కేంద్రం రూపొందించిన పోషణ ట్రాకర్‌ యాప్‌లో లబ్ధిదారుల ముఖ గుర్తింపు తప్పనిసరి చేయడం మరింత సమస్యగా మారింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బా లింతలు, మూడేళ్ల చిన్నారులకు ప్రతినెలా పోషకాహారాన్ని వారి ఇంటికే అందిస్తున్నారు. గతంలో కేంద్రం వద్ద వండి ఇచ్చేవారు. ఎక్కువ మంది నుంచి టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన్‌ ) కావా లంటూ అభ్యర్థనలు రావడంతో పాలు, గుడ్లు, నూనె, పప్పు, బియ్యం వంటివి ప్రతినెలా లబ్ధి దారులకు ఇస్తున్నారు. టీహెచ్‌ఆర్‌ పంపిణీలో అవకతవకలు జరగకుండా ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ముఖ చిత్ర యాప్‌)ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అ యితే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్టు చేయడం లేదని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. టీ హెచ్‌ఆర్‌ కోసం 7 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు పిల్లలు కేంద్రాలకు రారు. వారి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు వస్తుంటారు. ముఖచిత్రం ద్వారా టీహెచ్‌ఆర్‌ పంపిణీకి చాలా సమయం పడుతోంది. యాప్‌ నమోదు చేయడంలో ఇబ్బందుల కారణంగా ఎక్కువ సమయం వీటికోసమే కేటాయిస్తుండటంతో పూర్వ ప్రాథమిక విద్య పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిర్ణీత సమయంలో యాప్‌లలో నమో దు చేయాలంటూ యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు విధిగా రెండు యాప్‌లు నిర్వహించాలి. కేంద్రానికి చెందిన పోషణ ట్రాకర్‌లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణ వివరాలు నమోదు చేయాలి. ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందించే పోషణ వివరాలను నమోదు చేయాలి. ప్రీస్కూల్‌ నిర్వహించి ఆ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేషియల్‌ రికగ్నేషన్‌ హాజర్‌ నమోదు చేయాలి. వీటితోపాటు టీకా రిజిష్టర్‌, విటమిన్‌ – ఏ రికార్డు, రిఫరల్‌ సర్వీసెస్‌ గృహ సందర్శకుల రికార్డు చేయాలి. రికార్డుల పనిభారం తగ్గించి కొత్త పోన్లు సరఫరా చేయాలని అంగన్‌వాడి టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

త్వరలో కొత్త ఫోన్లు

పోషణ ట్రాకర్‌ యాప్‌లో లబ్ధిదారుల ఫేస్‌ రికగ్నైజేషన్‌ చేయడంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యతో అంగన్వాడీ టీచర్లు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపో ర్టు చేయడం లేదని పిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో కొత్త ఫోన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నరేశ్‌ డీడబ్ల్యూవో

జిల్లా స్వరూపం

ప్రాజెక్టులు 4

గర్భిణులు 7,267

బాలింతలు 4,553

0–6నెలల్లోపు పిల్లలు 4,518

07–నుంచి 3ఏళ్లలోపు పిల్లలు 32,437

3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 33,012

కిశోర బాలికలు 17,792

అంగన్‌వాడీలపై యాప్‌ల భారం1
1/1

అంగన్‌వాడీలపై యాప్‌ల భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement