
తెరుచుకున్న ఆలయాలు
ధర్మపురి/మల్యాల: చంద్రగహణం సందర్భంగా ఆదివారం రాత్రి మూసివేసిన ఆలయాలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ, హోమం తదితర పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు ఉన్నారు. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి దర్శనాన్ని ఉదయం 7.30గంటల నుంచి కల్పించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు తిరుమంజనం నిర్వహించారు. స్థానాచార్యులు, కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రాంచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

తెరుచుకున్న ఆలయాలు