లంబో‘ధర’ | - | Sakshi
Sakshi News home page

లంబో‘ధర’

Sep 6 2025 5:31 AM | Updated on Sep 6 2025 5:39 AM

● వినాయక లడ్డూకు పోటాపోటీ వేలం

● వినాయక లడ్డూకు పోటాపోటీ వేలం

జగిత్యాలటౌన్‌/జగిత్యాలజోన్‌: గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొదటిరోజు జిల్లా కేంద్రంలోని పలు మండపాల్లో గణనాథుడి లడ్డూలకు వేలం నిర్వహించగా భారీ ధర పలికింది. పద్మనాయక కల్యాణమంటపంలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను కల్లెడ గ్రామానికి చెందిన జోగినిపల్లి సందీప్‌రావు వైష్ణవి దంపతులు రూ.2,50,000లకు దక్కించుకున్నారు. అలాగే రెడ్డి సంఘం వినాయకుడి లడ్డూ రూ. 51,000 పలికింది. ఈ లడ్డూను గుర్రాల వినూత్నరెడ్డి–అనుకేత్‌ రెడ్డి దంపతులు దక్కించుకున్నారు. లడ్డూను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పెర వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రెడ్డి తదితరులున్నారు. జిల్లా కోర్టులో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూను రూ.22 వేలకు మహిళా న్యాయవాదులు దక్కించుకున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అందె మారుతి తదితరులు పాల్గొన్నారు.

యూరియాపై బీజేపీ, కాంగ్రెస్‌ డ్రామాలు

జగిత్యాల: యూరియా లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాట్లాడారు. యూరియా విషయంలో బీజే పీ, కాంగ్రెస్‌ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయ ని, ఒకవైపు రైతులు యూరియా కోసం గగ్గోలు పెడుతుంటే, కొరత లేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ఉన్న లక్ష్మణ్‌కుమార్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కవితను ఆడబిడ్డగా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీశ్‌రావుపై ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

జయప్రదం చేయాలి

కోరుట్ల: తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలను (ఈ నెల 11 నుంచి) జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ప్రభాకర్‌ స్మారక భవనంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావాలన్నారు. జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, సహాయ కార్యదర్శి భూమేశ్వర్‌, వెన్న సురేశ్‌, భూమయ్య, సుతారి రాములు, మౌలాన, ఉస్మాన్‌, శాంత పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో ఊరట

జగిత్యాలటౌన్‌/మెట్‌పల్లి: కేంద్ర ప్రభుత్వం ని త్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడా రు. ప్రధాని మోదీ నిర్ణయం బడుగు, బలహీనవర్గాలు, రైతులకు ఎంతో ఊరటనిచ్చిందని ఇది దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకగా అభివర్ణించారు. అలాగే జీఎస్టీ రేట్ల తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చారర్జి చెట్లపల్లి సుఖేందర్‌, గుంటుక సదాశివ్‌, బొడ్ల రమేశ్‌, ఇల్లెందుల శ్రీనివాస్‌, దొనికెల నవీన్‌, సుంకేట విజయ్‌ తదితరులున్నారు.

లంబో‘ధర’
1
1/3

లంబో‘ధర’

లంబో‘ధర’
2
2/3

లంబో‘ధర’

లంబో‘ధర’
3
3/3

లంబో‘ధర’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement