
మావోల తల్లి మృతి
హుజూరాబాద్: మావోయిస్టులు గోపగాని ఐలన్న, కుమరస్వామి తల్లి గోపగాని కొమరమ్మ(92)మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం ఉదయం మృతి చెందారు. కొమరమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. గోపగాని బలన్న, గోపగాని కుమరస్వామి నాటి పీపుల్స్‌వార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కుమారస్వామి 1979లో కమలాపూర్ మండలం గూడూరులో ఏర్పడిన తొలిదళంలో సభ్యుడిగా చేరాడు. దళంలో పనిచేస్తున్న సమయంలోనే గ్రానైట్ ప్రమాదంలో మృతి చెందాడు. ఐలన్న పీపుల్స్ వార్ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కిడ్నాప్‌నకు గురై 37 ఏళ్లు దాటినా ఆచూకీ లభించలేదు. కుమారుడి ఆచూకీకి ఎదురుచూసిన తల్లికి చివరికి నిరాశే మిగిలి మృతి చెందింది.
బావిలో పడి వృద్ధురాలు..
తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతిచెందింది. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌కు చెందిన అల్వాల లచ్చమ్మ (80) గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. సాయంత్రం గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో మృతిచెంది కనిపించింది. ఎల్‌ఎండీ పోలీసులు మృతురాలిని లచ్చమ్మగా గుర్తించారు.
కాల్వశ్రీరాంపూర్: అంత్యక్రియలకు వెళ్లి చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని పందిల్లకు చెందిన దబ్బెట రాధ కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. అనంతరం చెరువులో స్నానానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్(31) ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేదు. మృతుడికి భార్య ఉమ, కూతుర్లు అన్విత, వినూ త్న, తండ్రి రాజయ్య ఉన్నారు.
వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
జూలపల్లి: మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు. మండలానికి చెందిన మానసిక వికలాంగురాలిపై కొప్పుల మహేందర్ గత నెల 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురా లి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

మావోల తల్లి మృతి

మావోల తల్లి మృతి