
సురవరం ఆశయాలు, లక్ష్యాలు కొనసాగించాలి
కరీంనగర్: పేద ప్రజల పక్షపాతిగా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన గొప్ప కమ్యూనిస్టు యోధుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి సురవరం సుధాకర్‌రెడ్డి అని, ఆయన ఆశయాలు, లక్ష్యాలను కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సురవరం సంస్మరణ సభలో పలువురు నేతలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. నివాళి అర్పించి మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మృతిచెందడం రాజకీయాలకే అత్యంత బాధాకరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ.. పేదల సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వుట్కూరి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటితరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపజేశాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉమ్మెంతల రవీందర్‌రెడ్డి, బండ రాజిరెడ్డి, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, గోవిందుల రవి, చొక్కల శ్రీశైలం, పైడిపల్లి రాజు, చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్నస్వామి, న్యాలపట్ల రాజు, కంది రవీందర్‌రెడ్డి, బీర్ల పద్మ, కొట్టే అంజలి, బామండ్లపెల్లి యుగేందర్, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి