
ప్రయోగాలతో గుర్తింపు
ఇల్లంతకుంట(మానకొండూర్): లో కాస్ట్.. నో కాస్ట్ మెటీరియల్స్‌తో విద్యార్థులచే ప్రయోగాలు చేయిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఇల్లంతకుంట హైస్కూల్ బయాలజీ టీచర్ వుడుత మహేశ్‌చంద్ర. ఇప్పటివరకు విద్యార్థులతో 760 ప్రాజెక్టులు తయారు చేయించారు. 2002లో సైన్స్‌టీచర్‌గా విధుల్లో చేరారు. ఇల్లంతకుంట స్కూల్లో ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2023లో రాష్ట్ర, 2019లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అలాగే విద్యార్థులతో ప్రయోగాలు తయారు చేయించి జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్, సిల్వర్, ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకునేలా చేశారు.
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బద్దం రవీందర్‌రెడ్డి 2025– జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2002లో విధుల్లో చేరి, రెండేళ్లుగా కందికట్కూరులో పని చేస్తున్నారు. పాఠశాలలో గతేడాది 20 మంది విద్యార్థులు ఉండగా వేసవి సెలవుల్లో ఇంటింటా తిరిగి సంఖ్య 40 మందికి చేరేలా కృషి చేశారు. గ్రామస్తుల సాయంతో స్కూల్ భవనాన్ని రైలు థీమ్ పాఠశాలగా తీర్చిదిద్దారు. మెరుగైన విద్య అందించడంతోపాటు విద్యార్థులచే పలు యాక్టివిటీస్ చేయిస్తుంటారు.

ప్రయోగాలతో గుర్తింపు