
గూగుల్ కన్నా గురువే మిన్న
జ్యోతినగర్(రామగుండం): ప్రస్తుతం ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే గూగుల్‌ను సంప్రదిస్తున్నారు. కానీ, గూగుల్ కంటే గురువే మిన్న అని అన్నారు ఎన్టీపీసీ రామగుండం దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాల మ్యాథ్స్ టీచర్ కె.అనిత అన్నారు. పలు గణితోపకరణాలు తయారు చేసి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధిస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా 2024లో ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ నందు నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత సెమినార్‌లో పరిశోధన పత్రం సమర్పించినందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉండాలని పేర్కొన్నారు. గూగుల్ మనం ఏది అడిగితే ఆ జవాబు ఇస్తుంది కానీ.. గురువు అది తప్పా, ఒప్పా చెప్పి సరైన మార్గంలో వెళ్లేలా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
పేద విద్యార్థుల మాస్టారు.. గంగాధర్
కోరుట్ల: కోరుట్ల పట్టణానికి చెందిన సోమ గంగాధర్ పేద విద్యార్థుల మాస్టారుగా పేరు సంపాందించారు. కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2002లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. అక్కడ పేద విద్యార్థులను పాఠశాలకు తీసువచ్చి చదువు చెప్పాడు. విద్యాకమిటీ ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచారు. మెట్‌పల్లి మండలం ఆరపేటలో గణిత బోధన చేసి, మంచి లెక్కల మాస్టార్‌గా పేరు సంపాధించాడు. ప్రస్తుతం ఎంపీపీఎస్ అయ్యప్పగుట్ట పాఠశాలలో పని చేస్తున్నాడు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకుని, పుస్తకాలు, కాపీలు, పెన్నులు, బ్యాగులతోపాటు ఆర్థిక సాయం అందించి చదువుకునేందుకు సహకరించాడు.

గూగుల్ కన్నా గురువే మిన్న