
చిట్టీ డబ్బులతో ఉడాయించిన వ్యక్తిపై కేసు
కోరుట్ల రూరల్: మండలంలోని పైడిమడుగుకు చెందిన గుగ్గిళ్ల రమేశ్ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్టు అదే గ్రామానికి చెందిన ఆడె రవిచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం గుగ్గిళ్ల రమేశ్, ఆయన భార్య గాయత్రి చిట్టీల పేరుతో గ్రామంలో పది మంది నుంచి రూ.32.57లక్షలు వసూలు చేశారు. వాటిని తిరిగి ఇవ్వకుండా గ్రామం నుంచి పారిపోయారు. రవిచందర్ ఫిర్యాదు మేరకు రమేశ్, గాయత్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్రామంలో సుమారు రూ.కోటిన్నర వరకూ రమేశ్ చిట్టీల పేరిట వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని గ్రామస్తుల ద్వారా తెలిసింది.
కరీంనగర్‌స్పోర్ట్స్: జూని యర్ కళాశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఉ మ్మడి జిల్లా కార్యదర్శిగా గుమ్మడి మధు జాన్సన్ నియామకమయ్యారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ జూ నియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మధు జాన్సన్‌ను 2025–26 సంవత్సరానికి క్రీడా సమాఖ్య కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గంగాధర్ ఉత్తర్వులు జారీ చే శారు. ఈ సందర్భంగా మధు జాన్సన్‌ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సత్యవర్ధన్‌రావు, ఆంజనేయరావు, వెంకటరమణచారి, శశిధర్ శర్మ, నిర్మల, సుధాకర్, బల్బీర్ సింగ్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డిలు అభినందించారు.