
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు బుధవారం రాత్రి అస్వస్తతకు గురయ్యారు. పలువురు విద్యార్థులకు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో బుధవారం రాత్రి వైద్యం అందించారు. గురువారం ఉదయం లింగన్నపేట పీహెచ్‌సీ అధికారులు, సిబ్బంది పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. 446 మందికి వైద్యపరీక్షలు చేయగా.. 48 మంది విద్యార్థినులు జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు, కడుపునొప్పి, జ్వరం, పసిరికలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు అందజేశారు. సీహెచ్‌వో రమేశ్, వైద్య సిబ్బంది భారతి, శిల్ప, హేమలత, కల్పలత, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్యపరీక్షలు నిర్వహించిన పీహెచ్‌సీ సిబ్బంది