
పింఛన్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
జగిత్యాలజోన్: పింఛన్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ పెన్షన్ డైరెక్టర్ గోపాల్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్, వార్డు, పంచాయతీ కార్యదర్శులు, తపాలా అధికారులతో గురువారం సమీక్షించారు. పేదలకు ప్రభుత్వం వివిధ రకాల పింఛన్లు అందిస్తోందని, అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా పంపిణీ సరిగ్గా జరగాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ.. జిల్లాలో 2,21,847 లబ్ధిదారులకు రూ.48కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్ మాట్లాడుతూ.. పోస్టాఫీసు ద్వారా 26,438 పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సెర్ప్ అదనపు ప్రాజెక్టు అధికారి సునీత, పెన్షన్ అధికారి నాగేశ్వర్ రావు, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.