
మూఢనమ్మకాలపై అవగాహన
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం అధ్యాపకుడు.. ఎన్‌సీసీ అధికారి పర్లపల్లి రాజు రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. 14 ఏళ్లుగా ఎన్‌సీసీ అధికారిగా అనేక గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వ్యాధులు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రక్తదాన శిబిరాలతోపాటు రక్తదానంపై వివరిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏటా గ్రామాల్లో వందలాది మొక్కలు నాటారు. కాకతీయ వర్సిటీలో పసుపు పంటలపై కీటకాల వైవిధ్యంపై ప్రొఫెసర్ వెంకటయ్య ఆధ్వర్యంలో పరిశోధన చేశారు. వర్సిటీలో సమర్పించి మూడు పేటెంట్ హక్కులు పొందారు. ఎన్‌సీసీ లెఫ్టినెంట్ అధికారిగా ఐదేళ్లుగా క్యాడెట్లను త్రివిధ దళాలు, పోలీసుశాఖలో ఉద్యోగాలు సాధించేలా కృషి చేశారు. ఈయనకు అవార్డు రావడంపై ప్రిన్సిపల్ అశోక్ మాట్లాడుతూ.. మున్ముందు మరిన్ని అవార్డులు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సాయిమధుకర్, గోవర్దన్, సురేందర్, అభినందించారు.