
సామాజిక సేవకుడు గొల్లపల్లి గణేశ్
సారంగాపూర్/ధర్మపురి: ధర్మపురికి చెంది.. బీర్‌పూర్ మండలం తాళ్లధర్మారం పాఠశాలలో తెలుగు (స్కూల్ అసిస్టెంట్) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గొల్లపల్లి గణేశ్ పదేళ్లుగా బోధనతోపాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా 4వేల మంది పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేశారు. 15 మంది ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించారు. వుయ్ హెల్ప్ యూ సంస్థ కన్వీనర్‌గా పనిచేస్తూ వైద్య, విద్య అవసరాలకు తనమిత్రులతో కలిసి సాయం చేస్తున్నారు. ఇదే సంస్థ ద్వారా కరోనా సమయంలో రూ.4లక్షల విలువ చేసే పీపీఈ కిట్లు, వరదల సందర్భంగా రూ.4లక్షల నిత్యావసరాలు, ఇతర సామగ్రి అందించారు. కమలాపూర్ పాఠశాలలో రూ.2లక్షల సుందరీకరణ పనులు చేయించారు. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గణేశ్‌ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై బీర్‌పూర్ ఎంఈవో నాగభూషణం, ఉపాధ్యాయులు అభినందించారు.