
రసాయన శాస్త్రంలో పరిశోధనలు
జగిత్యాల: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన నీలి వాసవి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె రసాయన శాస్త్రంలో చేసిన 15 పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రచురితం అయ్యాయి. ప్రొఫెసర్ నసీం పర్యవేక్షణలో భూగర్భజలాలు, నేలపై ఘనవ్యర్థాలు అంశంపై పరిశోధన చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభంగా వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక చేసింది. ఆమెను కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ప్రమోద్‌కుమార్, చంద్రయ్య, సంగీతరాణి, వరప్రసాద్, డాక్టర్ సురేందర్‌రెడ్డి అభినందించారు.