రోడ్ల మరమ్మతు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

రోడ్ల మరమ్మతు చేపట్టండి

Sep 5 2025 5:24 AM | Updated on Sep 5 2025 5:24 AM

రోడ్ల

రోడ్ల మరమ్మతు చేపట్టండి

రోడ్ల మరమ్మతు చేపట్టండి ● మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ పాస్‌తోనే ఎరువులు విక్రయించాలి ● జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్‌ మద్యం షాపులు బంద్‌

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామేజీ అయిన రోడ్లు, బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని రాజనగర్‌లో తెగిపోయిన రోడ్లను గురువారం పరిశీలించారు. యుద్ధప్రతిపాదికన నిర్మాణ రోడ్లు, బ్రిడ్జిలకు మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు లక్ష్మీ, మండ రమేశ్‌, ఎలిగేటి మహిపాల్‌రెడ్డి, జగదీశ్‌, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీను, రవి, రంజిత్‌, రాజేశ్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు భారీకేడ్లు

ప్రమాదాల నివారణకు భారీకేడ్లు ఉపయోగపడతాయని జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో అత్తినేని అనసూయ, రాజన్న ఏర్పాటుచేసిన భారీకేడ్లను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఆదివారం మార్కెట్‌ నిర్వహించేలా అధికారులకు సూచించారు.

మల్లాపూర్‌: ఈ–పాస్‌ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్‌ అన్నారు. మండలకేంద్రంతోపాటు సిరిపూర్‌, ముత్యంపేట, చిట్టాపూర్‌లోని ప్యాక్స్‌ కార్యాలయాలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, రిజస్టర్లను తనిఖీ చేశారు. ఽయూరియా కోసం రైతులెవరూ అందోళన చెందవద్దని, అందరికీ అందిస్తామని తెలిపారు. అనంతరం మల్లాపూర్‌లో డిజిటల్‌ పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏవో లావణ్య, ఏఈవో గజానంద్‌, ప్యాక్స్‌ సీఈవోలు రమేశ్‌, భూమేశ్‌, రాజేశ్వర్‌రెడ్డి, రవితేజ, రైతులు పాల్గొన్నారు.

జిల్లాకు మోస్తరు వర్ష సూచన

జగిత్యాలఅగ్రికల్చర్‌: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శారస్త్‌రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల ఏడో తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. 8, 9తేదీల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

జగిత్యాలక్రైం: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని జిల్లాలో రెండురోజుల పాటు మద్యం షాపులు మూసివేయనునట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపా రు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఉద యం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అన్ని మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.

యూరియా కోసం రైతుల ధర్నా

గొల్లపల్లి: యూరియా కోసం రైతులు మండలకేంద్రంలోని జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. యూరియాను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా ఎప్పుడు వస్తుందో..? షాపుల్లో ఎంత స్టాక్‌ ఉందో తెలియడం లేదని, వ్యవసాయాధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా విరమింపజేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ మండల నాయకులు మద్దతు తెలిపారు.

రోడ్ల మరమ్మతు చేపట్టండి1
1/2

రోడ్ల మరమ్మతు చేపట్టండి

రోడ్ల మరమ్మతు చేపట్టండి2
2/2

రోడ్ల మరమ్మతు చేపట్టండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement