
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ● లబ్ధిదారులకు ప్రొసీ
గొల్లపల్లి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ.. విడతల వారీగా ఇళ్లు కేటాయించి నిధులు సమకూర్చుతామని తెలిపారు. మండలంలోని లొత్తునూర్ గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు అందించారు. కొందరి ఇళ్లకు ముగ్గుపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటను 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 50వేల ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్, బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ ఆస్తి తగాదాల్లోనే చిక్కుకుపోయిందని ఎద్దేవా చేశారు. అనంతరం గ్రామంలోని వంతెన పరిశీలించి నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం