
పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన
జగిత్యాలఅగ్రికల్చర్: పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పొలాస శాస్త్రవేత్తల బృందం గురువారం పర్యటించింది. ఈ మేరకు జగిత్యాల మండలం మోరపల్లి, రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటలను పరిశీలించారు. గోదావరి బ్యాక్ వాటర్‌తో 3 నుంచి 4 రోజులు పూర్తిగా పత్తి పంట నీటిలోనే ఉండటంతో.. పత్తి పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. దాదాపు 200 ఎకరాల్లో పత్తికి తీవ్ర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా అధిక వర్షాలకు పంట నష్టం జరుగకుండా ఎలా కాపాడుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందన భట్, రవి, సుమలత, రాజేష్, రామకృష్ణ, బి.శ్రీలక్ష్మి, ఏఈవో నరేశ్ పాల్గొన్నారు.

పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన