
బల్దియా కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ
జగిత్యాలటౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు గురువారం జగిత్యాల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు బల్దియా ప్రధాన ద్వారం వద్ద బైటాయించి నిరసన తెలిపారు. బల్దియా అధికారులు హిందువుల పండుగలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. భారీవర్షాలకు పలు కాలనీల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, శోభాయాత్రలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. గుంతల్లో మొరం పోయకపోవడం దారుణమన్నారు. రోడ్ల వెంట లైటింగ్ పెట్టకపోవడం సరికాదని పేర్కొన్నారు. బల్దియా డీఈకి వినతిపత్రం అందించారు. నాయకులు గంగాధర్, ఆముద రాజు, సిరికొండ రాజన్న, ఠాకూర్ పవన్‌సింగ్, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ, సాంబారి కళావతి, మమత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బల్దియా కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ