
● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: కేసీఆర్ పాలనలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు మరమ్మతు చేయించారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలోని ఊర చెరువును గురువారం పరిశీలించారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో కొందరు రైతుల పంటలు మునిగి నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం చెరువుకు మరమ్మతు చేపట్టి షటర్లు బిగించాలని కోరారు. ఆమె వెంట జగిత్యాల సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు ఆనందరావు, మహేశ్, కర్నాల శ్రీను, లింగన్న, బాలకృష్ణ, పవన్, రవి, మల్లేశం, ప్రశాంత్, లక్ష్మణ్, నరేశ్ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో సాగుకు పెద్దపీట