
ఆకట్టుకునేలా పాఠాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ జువాలజీ ఉపాధ్యాయుడు చిలుకూరి శివకృష్ణ 2014లో పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విధుల్లో చేరారు. అప్పటినుంచి విద్యార్థులను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లలో విద్యార్థులు బహుమతులు పొందేలా కృషి చేస్తున్నారు. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2022లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి, 2023లో టాప్ 10లో నిలిచారు. ఇన్‌స్పైర్ అవార్డుల్లో నాలుగుసార్లు రాష్ట్రస్థాయి, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్‌సీఎస్‌సీ)లో ఒకసారి సాధించారు. జవహార్‌లాల్ నెహ్రూ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ (ఆర్‌బీవీపీ)లో విద్యార్థులు పాల్గొనేలా కృషి చేశారు. గతంలో పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈయన టెక్ మహీంద్ర, సైన్స్ అకాడమీ నుంచి ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ అవార్డు, తెలంగాణ ఇన్నోవేషన్‌సెల్ (టీఎస్‌ఐసీ) విలేజ్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. హర్యానాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటి నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ పబ్లికేషన్ విడుదల చేశారు. శివకృష్ణను పాఠశాల ప్రిన్సిపల్ సరిదిదేవి, వైస్ ప్రిన్సిపల్ నగేశ్, ఉపాధ్యాయులు అభినందించారు.