
గణనాథుడికి పూజలు
గొల్లపల్లి : మండలంలోని రాఘవపట్నం గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంసుధాకర్ రావు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సంఘ సభ్యులు శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందించారు. వారియర్స్ యూత్ వినాయకుడి వద్ద పూజారి ఆంజనేయులు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ సర్పంచ్ సునంద, నాయకులు సత్యం, ముత్యంరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో ఇస్కాన్ చైర్మన్
వేములవాడ: రాజన్నను దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు జి.శ్రీనివాస్‌శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్‌చార్యులు, సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ ఉన్నారు.
భార్యను వేధించిన భర్తకు మూడేళ్ల జైలు
ముస్తాబాద్(సిరిసిల్ల): భార్యను వేధింపులకు గురిచేసి మద్యం మత్తులో దాడి చేసిన భర్తకు మూడేళ్ల జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన సడిమెల రామచంద్రం మద్యం సేవించి తరచూ భార్య కనకవ్వను వేధించేవాడు. 2016 డిసెంబర్ 2న కనకవ్వపై భర్త రామచంద్రం టార్చిలైట్‌తో దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రామచంద్రంపై కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై ప్రవీణ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. రామచంద్రంపై నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ ప్రవీణ్ మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేలు జరిమాన విధిస్తు తీర్పు వెలువరించారని ఎస్సై వివరించారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ ఇంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు బుధవారం రాత్రి పట్టణ ఎస్సై సుప్రియ తన సిబ్బందితో దాడిచేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.40,540 స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

గణనాథుడికి పూజలు