
విద్యుత్‌షాక్‌తో వృద్ధుడు మృతి
ఇబ్రహీంపట్నం: ఇంట్లోని విద్యుత్ వైరి తెగి షాక్‌తో వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలు భూమయ్య(70) ఇంట్లో మెయిన్ బెడ్రూంలోకి వచ్చే వైరు తెగిపోయింది. దానిని గమనించని భూమయ్య లోపలికి వెళ్లడంతో వైరుకు తాకి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంధువులు, స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సంఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.
● విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
వెల్గటూర్: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం మారేడ్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనంప్రకారం.. గ్రామానికి చెందిన లింగాల చిన్నయ్య పొలానికి నీరు పెట్టేందుకు మంగళవారం రాత్రి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. విగతజీవిగా పడి ఉన్నాడు. స్టార్టర్ బాక్స్ నుంచి వచ్చే వైరు ప్రమాదవశాత్తు చేతికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపెల్లి గ్రామానికి చెందిన ఆరే కొమురయ్య (75) కుష్ఠుతో బాధపడుతూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకు న్నాడని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కొమురయ్య కొంతకాలంగా కుష్ఠుతో బాధపడుతున్నాడ. చికిత్స పొందినా నయంకాలేదు. మనస్తాపంతో గతనెల 29న పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు మృతుడి కుమారుడు సత్తయ్య పోలీసులక ఫిర్యాదు చేశాడు.
పోలీసుల అదుపులో చిట్టి వ్యాపారి
కోరుట్ల: చిట్టిల పేరుతో కోరుట్ల పరిసర ప్రాంతాల వారికి రెండేళ్ల క్రితం రూ.కోటి మేర కుచ్చుటోపి పెట్టి పరారైన వ్యక్తిని బుధవారం మధ్యాహ్నం కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 35 నుంచి 50 మంది బాధితులు తాము వ్యాపారికి చెల్లించిన డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యుత్‌షాక్‌తో వృద్ధుడు మృతి