
నష్టంపై రైతులవారీగా వివరాల సేకరణ
సారంగాపూర్: భారీ వరదలు, వర్షాలకు నష్టపోయిన పంటలపై రైతువారీగా సర్వే చేపట్టినట్లు జి ల్లా వ్యవసాయాధికారి వి.భాస్కర్ అన్నారు. బుధవారం బీర్‌పూర్ మండలం రంగసాగర్‌లో ఇటీవలి వరదలు, వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీ లించారు. వరదలకు పత్తి, వరి పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఇసుకమేటలు వేసి, పలు చోట్ల భూములు కోతకు గురికావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. గోదావరి తీర రైతులకు నష్టం ఎక్కువగా ఉందన్నారు. నష్టపోయిన పంటలు, ఇసుకమేటలపై రైతువారీగా మండల వ్యవసాయ విస్తీర్ణాధికారులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, మండల వ్యవసాధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారులు ప్రదీప్‌రెడ్డి, తిరుపతినాయక్, ఏఈవో అయ్యోరి వినోద్, రంగసాగర్ గ్రామ రైతులు ఉన్నారు.