
నష్టం అంచనా రూ.58 కోట్లు
తాత్కాలిక మరమ్మతుకు రూ.2.28 కోట్లు శాశ్వత మరమ్మతుకు రూ.58.27 కోట్లు ప్రణాళిక రూపొందించిన అధికారులు మరమ్మతులకు రూ.5 కోట్లు విడుదల
జగిత్యాల: జిల్లాలో గతనెల 16 నుంచి 29 వరకు కురిసిన వర్షానికి కొన్ని ఇళ్లు కూలిపోయాయి. పంట నష్టం కూడా భారీగా జరిగింది. రోడ్లు, అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలల పైప్‌లైన్లు, కాంపౌండ్‌వాల్స్ చాలావరకు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు నష్టం అంచనా రూపొందించారు. పంచాయతీరాజ్ పరిధిలోని 16 రోడ్లు ధ్వంసం కాగా.. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో కాజ్‌వే, రోడ్లు చెడిపోయాయి. పలు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పగుళ్లు చూపాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు రూ.2.28 కోట్లతో అంచనా వేశారు. శాశ్వత మరమ్మతుకు రూ.58 కోట్లు అవసరమని అంచనాకొచ్చారు. మొత్తంగా 26 ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. రెండు పశువులు చనిపోయాయి. 139 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. పంట నష్టం జరిగిన వారికి ఎకరాన రూ.10 వేల చొప్పున, ఇల్లు కూలిపోయిన వారికి రూ.5,500 చొప్పున ఇవ్వనున్నారు. వరదలో కొట్టుకుపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వనున్నారు.
తక్షణ సహాయం విడుదల
వరదలు, వర్షాలతో కలిగిన నష్టాలకుగాను ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం కింద నిధులు విడుదలయ్యాయి. నష్టం భారీగా వాటిల్లిన జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున కేటాయించగా.. మిగతా జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిని తక్షణ మరమ్మతు కోసం ఉపయోగించాలని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా రోడ్లు, వంతెనలు, తాగునీరు, కల్వర్టుల మరమ్మతుకు వినియోగించాలని చెప్పినట్లు సమాచారం. జిల్లాలో తాత్కాలికంగా రూ.2.28 కోట్లతో అంచనాలు వేశారు. శాశ్వత మరమ్మతుల కోసం రూ.58.27 కోట్లు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కొద్దిమొత్తంలోనే నిధులు విడుదల కావడంతో ఈ పనులు రూపొందించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

నష్టం అంచనా రూ.58 కోట్లు

నష్టం అంచనా రూ.58 కోట్లు