
ఆస్పత్రిలో బెడ్లు ఏర్పాటు చేస్తాం
రాయికల్: రాయికల్ ప్రభు త్వ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా బెడ్లను ఏర్పాటు చేస్తామని వైద్య విధాన పరిషత్ జిల్లా కో–ఆర్డినేటర్ రామకృష్ణ అన్నారు. పట్టణంలో రోగులు పెరుగుతుండడంతో ‘రోగులు ఫుల్.. బెడ్లు నిల్’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన రామకృష్ణ ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తామని, తాగునీటి కొరత తీర్చేందుకు ఆస్పత్రిలో మరో వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శశికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
కవిత ఫ్లెక్సీ తొలగింపు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కవిత ఫ్లెక్సీని మాజీ ఎంపీపీ రాజు తొలగించారు. బీఆర్‌ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఫ్లెక్సీని తొలగించామన్నారు.
8న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్
జగిత్యాల: ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఈనెల 8న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీచర్స్ భవన్‌లో సెమినార్ ఉంటుందని, పాల్గొనే విద్యార్థులకు ఆరు నిమిషాల చొప్పున సమయం ఉంటుందని, 5 ఫ్లకార్డులను ఉపయోగించుకోవచ్చని, మొదటిస్థానంలో నిలిచిన వారు ఈనెల 18న రాష్ట్రస్థాయిలో నిర్వహించే సెమినార్‌కు ఎంపికవుతారని, అందులో ప్రతిభ కనబర్చిన వారు అక్టోబర్ 30న బెంగళూరులోని విశ్వేశ్వర ఎంబసీలో జరిగే సెమినార్‌లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు.
కల్వర్టులకు మరమ్మతు చేయండి
రాయికల్: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తి న్న కల్వర్టులకు వెంటనే మరమ్మతు చేపట్టా లని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అ న్నారు. మండలంలోని మూటపల్లి, కొత్తపేట గ్రామాల మధ్యనున్న కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెగిపోయిన కల్వర్టును ఆమె బుధవారం పరిశీలించారు. మండలంలో ఆరు కల్వర్టులు తెగిపోయాయని, ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి శాశ్వతంగా కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మ హేశ్వర్‌రావు, నాయకులు మందుల శ్రీను, ప్ర శాంత్‌రావు, కంటె గంగారాం, సుతారి తిరుప తి, ప్రవీణ్, రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: వైఎస్సార్ హయాంలో.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలరూరల్ మండలం కల్లెడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో గత ప్రభుత్వం ఒక ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, బియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాయకులు గాజంగి నందన్న, సందీప్‌రావు, అంకతి గంగాధర్, చకిణం గంగాధర్ పాల్గొన్నారు.

ఆస్పత్రిలో బెడ్లు ఏర్పాటు చేస్తాం

ఆస్పత్రిలో బెడ్లు ఏర్పాటు చేస్తాం

ఆస్పత్రిలో బెడ్లు ఏర్పాటు చేస్తాం

ఆస్పత్రిలో బెడ్లు ఏర్పాటు చేస్తాం