
ప్రజాసంక్షేమానికి పరితపించిన నేత వైఎస్సార్
జగిత్యాలటౌన్: ప్రజా సంక్షేమం కోసం మహానేత వైఎస్సార్ పరితపించారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఇందిరాభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని.. అధికారంలోకొచ్చాక తొలి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారని గుర్తు చేశారు. జగిత్యాల అభివృద్ధిలో వైఎస్సార్ కృషి మరువలేనిదన్నారు. జేఎన్టీయూ, వెటర్నరీ కళాశాల, పొలాస వ్యవసాయ కళాశాల, న్యాక్ సెంటర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, ధర రమేశ్, చందారాధాకిషన్, జున్ను రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
విప్ ఆది శ్రీనివాస్ నివాళి
కథలాపూర్: కథలాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.