
చేపలు పట్టుకోనివ్వడం లేదు
మాది కొడిమ్యాల మండలం నమిలకొండ. 1989లో మత్స్యపారిశ్రామిక సంఘంగా ఏర్పడాం. మా సంఘం పరిధిలోని జఫర్‌ఖాన్ చెరువు, పాలిపల్లికుంట, చందావాణికుంట, కోమటి కుంట, గణేశ్‌కుంట, నక్కలకుంట చెరువుల్లో చేపలు పెంపకమే ఆధారంగా జీవిస్తున్నాం. సంఘంతో సంబంధంలేని కొందరు ఇతర కులస్తులు మా చెరువుల్లో దొంగచాటుగా చేపలు పడుతున్నారు. అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయండి.
– నమిలకొండ మత్స్యపారిశ్రామిక
సంఘం ప్రతినిధులు