
సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి
● ఎస్పీ అశోక్‌కుమార్
మెట్‌పల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఎస్పీ అశోక్‌కుమార్ కోరా రు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. సీసీ కెమెరాలతో ఇప్పటికే అనేక కేసుల్లో నిందితులను పట్టుకున్నామన్నారు. ప్రతి వీధిలో.. ముఖ్యమైన కూ డళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కుగానీ, స్థానిక పోలీస్‌స్టేషన్‌కుగా నీ సమాచారం అందించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం సందర్బంగా 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా.. వాటిని అందించిన వారిని ఎస్పీ అభినందించారు. డీ ఎస్పీ రాములు, సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్, రాజు తదితరులు ఉన్నారు.