
మహానేత వర్ధంతి
సాగునీటి ప్రాజెక్టులు, ఉన్నత విద్య రాజన్న చలువే
నేడు దివంగత మహానేత వర్ధంతి
కరీంనగర్: వైఎస్సార్.. పేదల పెన్నిధిగా పేరుగాంచారు. ఆయన మననుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా.. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతిఇంటికీ చేరాయంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘం.
2004–2009 కాలంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయించారు. విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ఆయన ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. నేడు ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.