
6–8 గంటలు నిద్రించాల్సిందే..
ఒక్కోసారి విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. తాజాగా కరీంనగర్‌లోని ఓ యువకుడు నిద్రలేమికి చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితికి చేరుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ప్రతీ వ్యక్తికి రోజూ 6–8 గంటలపాటు నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పురుషులే అధికం
మహిళ, పురుషుల్లో గమనిస్తే పురుషులు 81 శాతం మంది కనీసం 6 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది 6 గ ంటలలోపు నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో పురుషులు అధిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.