
మరోచోట ఏర్పాటు చేయాలి
శ్మశానవాటిక స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పా టు చేయడం సరికాదు. ప్లాంట్ ఏర్పాటు పనుల్లో శవాల ఎముకలు బయటపడ్డాయి. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి.
– మర్కు లక్ష్మణ్, బీఆర్‌ఎస్ నేత
ఉన్నతాధికారులు చొరవ చూపాలి
శ్మశానవాటిక స్థలాన్ని చదును చేసే పనులు విరమించుకోవాలి. అంత్యక్రియలు జరిపేందుకు వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలనే యోచన సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి.
– తాడిచెట్టి శ్రీకాంత్, రాఘవాపూర్
ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు
కొందరు గ్రామస్తులు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. శ్మశానవాటికలో కాకుండా రెవెన్యూ అధికారులు నిర్ధారించిన హద్దుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం.
– శ్రీమాల, జిల్లా సహకారశాఖ అధికారి

మరోచోట ఏర్పాటు చేయాలి

మరోచోట ఏర్పాటు చేయాలి