
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
జగిత్యాల/గొల్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. ఇళ్లు మంజూరైన వారందరూ వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చూడాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు సందర్శించి పరిశీలించాలని పేర్కొన్నారు. వివిధ కారణా లతో పనులు ప్రారంభించలేకపోయిన లబ్ధిదారుల ను కలిసి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం గు రించి వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవో లు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. అంతకుముందు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాల్లో శానిటేషన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు, ఎంపీవో మహేందర్, ప్రత్యేకాధికారి శంషేర్‌అలీ, పంచాయతీ కార్యదర్శి నవీన్ ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్