
గ్రామగ్రామాన వైద్య పరీక్షలు
ఇబ్రహీంపట్నం: జిల్లాలోని గ్రామగ్రామాన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఇప్పటివరకు 68 గ్రామాల్లో పరీక్షలు చేసినట్లు తెలిపారు. బీపీ, షుగర్, టీబీ, హెచ్‌ఐవీ, హైపటైటీస్, సుఖవ్యాధుల పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యాధికారులు నవీన్‌కుమార్, సీహెచ్‌వోలు విజయభాస్కర్, సుల్తానా, టీబీ సూపర్‌వైజర్ ఆంజనేయులు, సీహెచ్‌ఎన్ హేమలత, హెచ్‌ఈవో కృపాకర్, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతరాలయం విస్తరణతో భక్తులు ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేశారు. తద్వారా ఆలయ ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.
ఆర్యవైశ్యుల గోరింటాకు ఉత్సవాలు
రాయికల్: పట్టణంలోని వాసవీమాతా ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢమాసం గోరింటాకు ఉత్సవాలను నిర్వహించారు. మహిళలు అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. గోరింటాకు పెట్టుకున్నారు. కార్యక్రమంలో పట్టణ అ ధ్యక్షురాలు జిల్లా లావణ్య, ప్రధాన కార్యదర్శి సిద్దంశెట్టి స్వప్న, కోశాధికారి అయిత మాధవి, మండల అధ్యక్షుడు ఎలగందుల వీరేశం పాల్గొన్నారు.
‘ఉత్తమ’ గడువు పొడిగింపు
జగిత్యాల: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వరకు గడువు పొడిగించినట్లు డీ ఈవో రాము తెలిపారు. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు జాతీయస్థాయి అవార్డు కోసం అర్హత గల అన్ని కేటగిరీలు గల ఉత్తములు NATIO NALAWATOTEACHEQ.EDUCATIO N.GO V.I N లో అప్‌లోడ్ చేసుకోవాలన్నారు.
వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి సమావేశం
సారంగాపూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ మంగళవారం పీహెచ్‌సీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, టీబీ ముక్త్‌భారత్ అభియాన్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులు హాజరుకావాలి
జగిత్యాల: సహాయ ఉపకరణల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు బుధవారం ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో హాజరుకావాలని సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్ తెలిపారు. జిల్లా స్క్రీనింగ్ కమిటీ ద్వారా పరిశీలన, ధ్రువీకరణ ఉంటుందని పేర్కొన్నారు.

గ్రామగ్రామాన వైద్య పరీక్షలు

గ్రామగ్రామాన వైద్య పరీక్షలు

గ్రామగ్రామాన వైద్య పరీక్షలు