
బీసీల ఆర్డినెన్స్ ఎన్నికల స్టంటే..
జగిత్యాల: బీసీల ఆర్డినెన్స్ కేవలం స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీసీల పక్షాన నిలిచి న్యాయం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. అన్ని కులాల వృత్తులకు ఊతమిచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. గంగపుత్రులు, రజక, నాయీబ్రాహ్మణులనూ మోసం చేస్తోందన్నారు. నాయకులు గంగాధర్, మల్లేశం, ప్రవీణ్‌గౌడ్, శంకర్, రాజన్న, మల్లారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.